రవితేజ హీరోగా 'విక్రమ్ వేద' రీమేక్?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రవితేజ హీరోగా 'విక్రమ్ వేద' రీమేక్?

  • తమిళంలో హిట్ కొట్టిన 'విక్రమ్ వేద'
  • తెలుగు రీమేక్ కి మొదలైన సన్నాహాలు 
  • 'వేద' పాత్రలో కార్తికేయ?
'రణరంగం' సినిమాతో హిట్ కొట్టడం ఖాయమని దర్శకుడు సుధీర్ వర్మ భావించాడు. కానీ ఈ సినిమా ఆయన నమ్మకాన్ని నిలబెట్టలేకపోయింది. ఈ సినిమా ఫలితం నిరాశ పరిచినా, వెంటనే తేరుకుని మరో ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి రంగంలోకి దిగాడు. తమిళంలో వచ్చిన 'విక్రమ్ వేద' సినిమాను తెలుగులోకి రీమేక్ చేసే పనిలో వున్నాడు.

2017 జూలైలో విడుదలైన 'విక్రమ్ వేద' అక్కడ భారీ విజయాన్ని నమోదు చేసింది. మాధవన్ - విజయ్ సేతుపతి కెరియర్లో చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా తెలుగు రీమేక్ లో పోలీస్ ఆఫీసర్ 'విక్రమ్' పాత్ర కోసం రవితేజను సుధీర్ వర్మ ఒప్పించినట్టుగా ప్రచారం జరుగుతోంది. 'వేద' అనే గ్యాంగ్ స్టర్ పాత్ర కోసం కార్తికేయను తీసుకునే ఆలోచనలో సుధీర్ వర్మ వున్నాడని అంటున్నారు. కార్తికేయ ఈ పాత్రను అంగీకరించే అవకాశాలు ఎక్కువనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
Raviteja
karthikeya

More Telugu News