'డిస్కోరాజా'లో నా పాత్ర కొత్తగా ఉంటుంది: హీరో బాబీ సింహా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'డిస్కోరాజా'లో నా పాత్ర కొత్తగా ఉంటుంది: హీరో బాబీ సింహా

  • నేను పుట్టింది హైదరాబాద్ లోనే 
  • పాత్రలో కొత్తదనం ఉంటేనే ప్రాధాన్యతనిస్తాను 
  • తెలుగు సినిమాలపై దృష్టిపెడతానన్న బాబీ సింహా
రవితేజ కథానాయకుడిగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో 'డిస్కో రాజా' రూపొందుతోంది. ఈ సినిమాలో ఒక విభిన్నమైన పాత్రలో బాబీ సింహా కనిపించనున్నాడు. తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో బాబీ సింహా మాట్లాడుతూ .. " పాత్ర పరంగా కొత్తదనం ఉంటేనే నేను గ్రీన్ సిగ్నల్ ఇస్తాను .. లేదంటే 'సారీ బాస్' అని చెప్పేస్తాను.

అలాంటి కొత్తదనం ఉండటం వల్లనే తెలుగులో 'ఏదైనా జరగొచ్చు' చేశాను. ఇంతవరకూ నేను చేసిన పాత్రలకి పూర్తి భిన్నంగా ఉండటం వల్లనే 'డిస్కోరాజా' చేశాను. ఈ పాత్ర నాకు మంచి పేరు తీసుకొస్తుందనీ, తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ చేస్తుందనే నమ్మకం వుంది. నేను పుట్టింది హైదరాబాద్ లోనే ... కాలేజ్ చదువు కోయంబత్తూరులో జరిగింది. తమిళంలో బిజీగా ఉండటం వలన తెలుగు సినిమాలు చేయడం కుదరలేదు. ఇకపై తెలుగు సినిమాలపై మరింత శ్రద్ధ పెడతాను" అని చెప్పుకొచ్చారు.
Bobby Simha

More Telugu News