మన్మోహన్ కు అత్యున్నత స్థాయి సెక్యూరిటీ తొలగింపు
- మన్మోహన్ కు ఎస్పీజీ సెక్యూరిటీ తొలగింపు
- సీఆర్పీఎఫ్ భద్రత కిందకు మాజీ ప్రధాని
- కొనసాగనున్న జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ
ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ, ప్రముఖుల జీవితాలకు ముప్పు ఎంత వరకు ఉందనే వార్షిక సమీక్ష సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. మన్మోహన్ కు ఎస్పీజీ భద్రతను తొలగించినప్పటికీ... ఆయనకు ఉన్న జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కొనసాగుతుందని చెప్పారు. మరోవైపు, పదేళ్ల పాటు దేశ ప్రధానిగా ఉన్న మన్మోహన్... తన భద్రత విషయంలో ఎలాంటి ఆందోళనకు గురికావడం లేదు.