విజయ్ దేవరకొండ సినిమా పనులతో బిజీగా పూరి
Add ap7am to your home Screen

విజయ్ దేవరకొండ సినిమా పనులతో బిజీగా పూరి

  • స్క్రిప్ట్ పనులతో బిజీగా పూరి 
  • ప్రీ ప్రొడక్షన్ పనులు కానిచ్చేస్తోన్న చార్మీ 
  • నవంబర్లో సెట్స్ పైకి వెళ్లే దిశగా పనులు     
పూరి జగన్నాథ్ దర్శకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ఆయన తన తదుపరి చిత్రాన్ని విజయ్ దేవరకొండతో ప్లాన్ చేసుకున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ఎనౌన్స్ మెంట్ జరిగిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పైనే పూరి కసరత్తు చేస్తున్నాడట.

మరో వైపున ప్రీ ప్రొడక్షన్ పనులతో చార్మీ బిజీగా ఉందట. త్వరలోనే హీరోయిన్లతో పాటు మిగతా నటీనటుల, సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియను ఆరంభించనున్నట్టు తెలుస్తోంది. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగు మొదలుపెట్టాలనే దిశాగా ఈ పనులు జరుగుతున్నాయని అంటున్నారు. ఒక కథానాయికగా నభా నటేశ్ వుండే అవకాశం లేకపోలేదనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. పూరి - విజయ్ దేవరకొండ కాంబినేషన్ పట్ల అభిమానులు పూర్తి ఆసక్తితో వున్నారు.
Vijay Devarakonda
Puri
Charmi

More Telugu News