'కార్తికేయ 2' సినిమాకి స్క్రిప్ట్ సిద్ధం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'కార్తికేయ 2' సినిమాకి స్క్రిప్ట్ సిద్ధం

  • గతంలో వచ్చిన 'కార్తికేయ' హిట్
  • 'కార్తికేయ 2'కి సన్నాహాలు 
  • అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్  
నిఖిల్ కథానాయకుడిగా కొంతకాలం క్రితం రూపొందిన 'కార్తికేయ' యూత్ నుంచి మంచి మార్కులు కొట్టేసింది. దర్శకుడిగా ఈ సినిమా చందూ మొండేటికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత ఆయన చేసిన సినిమాలు అంతగా విజయాన్ని సాధించలేదు. ఈ నేపథ్యంలో ఆయన 'కార్తికేయ'కి సీక్వెల్ చేయడానికి రంగంలోకి దిగాడు.

నిఖిల్ కథానాయకుడిగా 'కార్తికేయ 2'ను రూపొందించడానికి ఆయన సన్నాహాలు చేసుకున్నాడు. ఇప్పటికే స్క్రిప్టు వర్కును పూర్తిచేసిన ఆయన, అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగుకి వెళ్లాలనే ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం. విశ్వప్రసాద్ .. వివేక్ కూచి భొట్ల ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కథానాయికతో పాటు ఇతర నటీనటులను, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసే ప్రక్రియ నడుస్తోందని అంటున్నారు. త్వరలోనే ఆ వివరాలు తెలియనున్నాయి. 
Nikhil
Chandu Mondeti

More Telugu News