కశ్మీర్ అంశంపై నేడు జాతిని ఉద్దేశించి కీలక ప్రసంగం చేయనున్న ప్రధాని మోదీ!
Add ap7am to your home Screen

కశ్మీర్ అంశంపై నేడు జాతిని ఉద్దేశించి కీలక ప్రసంగం చేయనున్న ప్రధాని మోదీ!

  • ఆర్టికల్ 370 రద్దుతో స్పెషల్ స్టేటస్ కోల్పోయిన జమ్ముకశ్మీర్
  • రెండు ముక్కలైన జమ్ముకశ్మీర్
  • నేటి ప్రసంగంలో కారణాలను వివరించనున్న ప్రధాని
ఆర్టికల్ 370 రద్దుతో జమ్ముకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని కోల్పోయిన సంగతి తెలిసిందే. దీనికి తోడు జమ్ముకశ్మీర్ రాష్ట్రం రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయింది. ఈ నేపథ్యంలో, ప్రధాని మోదీ నేడు జాతిని ఉద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నారు. జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించడం, రాష్ట్రాన్ని రెండు యూటీలుగా చేయడానికి గల కారణాలను ప్రజలకు ఆయన ఈ సందర్భంగా వివరించనున్నారు.

మార్చి 27న మోదీ చివరి సారిగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. లోక్ సభ ఎన్నికలకు ముందు ఆయన ప్రసంగిస్తూ, శాటిలైట్ ను యాంటీ శాటిలైట్ మిస్సైల్ తో కూల్చివేసే అంశంలో భారత్ విజయం సాధించిందని దేశ ప్రజలకు ఆ సందర్భంలో ఆయన తెలిపారు. స్పేస్ టెక్నాలజీలో భారత్ మరో కీలక విజయం సాధించిందని చెప్పారు.

మరో వారం రోజుల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగనున్న తరుణంలో.. మోదీ ఈరోజు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
Modi
Jammu And Kashmir
Article 370

More Telugu News