ఆర్మీ జవాన్లను ఉత్సాహపరిచేందుకు గాయకుడి అవతారమెత్తిన ధోనీ
- కశ్మీర్ లోయలో సాధారణ గార్డు విధులు నిర్వర్తిస్తున్న ధోనీ
- పారామిలిటరీలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ధోనీ
- ఉద్రిక్త పరిస్థితుల్లోనూ గుండె నిబ్బరంతో విధుల్లో పాల్గొంటున్న వైనం
'కభీ కభీ' చిత్రంలోని 'మై పల్ దో పల్ కా షాయర్ హూ' పాట పాడి అలరించాడు. ప్రస్తుతం 106 టీఏ బెటాలియన్ లో లెఫ్టినెంట్ కల్నల్ గా వ్యవహరిస్తున్న ధోనీ ఆగస్టు 15 వరకు విధుల్లో కొనసాగనున్నాడు. కాగా, ధోనీకి సంబంధించిన మరో ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణ సౌకర్యాలున్న ఓ గదిలో తన బూట్లను తానే పాలిష్ చేసుకుంటూ సింపుల్ గా కనిపించాడు. ధోనీ నిరాడంబరతకు ఇదే నిదర్శనం అంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.