చిక్ మగళూరు దోసె, నీలగిరి కాఫీ... సీక్రెట్ ను కోడలితో పంచుకున్న చిరంజీవి

04-08-2019 Sun 18:25 | Both States
  • చిరంజీవి నివాసంలో కాఫీ, దోసెలతో ఆతిథ్యానికి ఎంతో పేరు
  • ప్రభుదేవా, జయసుధ వంటి సెలబ్రిటీలు సైతం ఫిదా
  • ఆ రెసిపీల వెనుకున్న కథ కోడలికి వివరించిన చిరు
తెలుగు చిత్రసీమలో మెగాస్టార్ చిరంజీవిని అభిమానించని వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. ప్రతి ఒక్కరితోనూ ఆయన ఎంతో ఆప్యాయంగా మెలుగుతారు. తన ఇంటికి వచ్చినవాళ్లకు ఆయనిచ్చే ఆతిథ్యం మర్చిపోలేని విధంగా ఉంటుందని చెబుతారు. ముఖ్యంగాచిరంజీవి ఇంట్లో చేసే దోసెలు, కాఫీ రుచి ఎక్కడా కనిపించదని ఇండస్ట్రీలో ఓ టాక్ ఉంది. ప్రభుదేవా, జయసుధ వంటి వాళ్లు కూడా ఆ రెండింటి కోసమే చిరు నివాసానికి వస్తుంటారంటే అతిశయోక్తి కాదు. అది నిజమేనని చిరంజీవి కూడా అంగీకరించారు.

తాజాగా, తన కోడలు ఉపాసనకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దోసె, కాఫీ రుచి గురించి వివరాలు తెలిపారు. మొదట్లో తనకు కాఫీ అంటే ఇష్టం ఉండేది కాదని, కానీ తన అర్ధాంగి సురేఖ చేసే ఫిల్టర్ కాఫీ ఒక్కసారి రుచి చూసిన తర్వాత కాఫీ లవర్ గా మారిపోయానని వివరించారు. సురేఖ నీలగిరి కాఫీ తోటల నుంచి ప్రత్యేకంగా గింజలు తెప్పించి, వాటిని వేయించి పొడిచేసేదని వెల్లడించారు. మద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చేశాక కూడా అదే పద్ధతి అనుసరిస్తున్నామని, అందుకే తమ ఇంటి కాఫీ అంటే జనాలు పడిచచ్చిపోతుంటారని చెప్పారు.

ఇక, దోసె గురించి చెబుతూ, ఓ సినిమా షూటింగ్ కోసం చిక్ మగళూరు వెళ్లినప్పుడు అక్కడ ఓ హోటల్ లో దోసె తిన్నానని, దాని రుచి అమోఘమని అన్నారు. దోసెకు అంత రుచి ఎలా వచ్చిందో చెప్పమంటే ఆ హోటల్ యజమాని నిరాకరించాడని చిరంజీవి వెల్లడించారు. ఇంటికి వచ్చిన తర్వాత సురేఖతో చాలాసేపు చిక్ మగళూరు దోసె గురించే మాట్లాడానని, చివరికి ఇద్దరం కలిసి అనేక కాంబినేషన్లతో ప్రయోగాలు చేసి చిక్ మగళూరు దోసె కంటే అద్భుతమైన రుచి వచ్చే దోసెను సాధ్యం చేయగలిగామని చెప్పారు.

తాను సాధించిన దోసె రెసిపీ గురించి చట్నీస్ రెస్టారెంట్ యజమాని అడిగితే ఆనందంగా చెప్పేశానని చిరు పేర్కొన్నారు. ఆ రెసిపీని చిరంజీవి దోసె బ్రాండ్ నేమ్ తో వాళ్లు కస్టమర్లకు పరిచయం చేశారని, అది ఎంతో పాప్యులర్ అయ్యిందని వివరించారు.
DoseCoffeeChiranjeeviUpasana

More Telugu News

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03
..more