చిరంజీవిని కుర్రాడిలా మార్చేసిన ఉపాసన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చిరంజీవిని కుర్రాడిలా మార్చేసిన ఉపాసన

  • బీ పాజిటివ్ మ్యాగజైన్ కోసం ఇంటర్వ్యూ ఇచ్చిన చిరు
  • కవర్ పేజీ కోసం ప్రత్యేకంగా ఫొటోషూట్
  • స్లిమ్ లుక్ లో అదరగొడుతున్న మెగాస్టార్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తాజాగా బీ పాజిటివ్ అనే మ్యాగజైన్ కోసం ఫొటోషూట్ లో పాల్గొన్నారు. ఈ మ్యాగజైన్ అపోలో లైఫ్ సంస్థ కోసం మెగా కోడలు ఉపాసన నిర్వహిస్తోంది. అయితే, లేటెస్ట్ ఎడిషన్ కోసం చిరంజీవితో ఇంటర్వ్యూ నిర్వహించిన ఉపాసన, తన మామ గారిని మరింత కుర్రాడిలా మార్చేసి కవర్ పేజీ కోసం ఫొటోషూట్ నిర్వహించింది. అందులో పాతరోజుల్లో కనిపించిన చాకులాంటి చిరంజీవి మళ్లీ దర్శనమిచ్చాడు.

సింపుల్ హెయిర్ స్టయిల్, కళ్లకు జోడు, స్లిమ్ లుక్ తో చిరంజీవి తన వయసును డామినేట్ చేస్తున్నాడు. ఈ ఫొటోలు చూస్తే చిరంజీవి వయసు 63 అంటే ఎవరూ నమ్మరేమో! ఉపాసన కూడా ట్విట్టర్ లో ఇదే విషయాన్ని చెబుతోంది. ఎప్పటికీ మెగాస్టార్ నిత్యయవ్వనుడే అంటూ ట్వీట్ చేసింది.

మామయ్య ఎంతో స్ఫూర్తిదాయకమైన ఇంటర్వ్యూ ఇచ్చారని, బీ పాజిటివ్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఆయన లుక్ చూస్తే కళ్లు జిగేల్మంటాయంటూ పేర్కొంది. కాగా, ఈ ఫొటోషూట్ ను ప్రఖ్యాత సెలబ్రిటీ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ డబూ రత్నానీ నిర్వహించారు.
Chiranjeevi
Upasana
B Positive

More Telugu News