ఏదో ఒకరోజు టీమిండియా కోచ్ పదవికి దరఖాస్తు చేస్తా: గంగూలీ
- టీమిండియా కోచ్ పదవిపై గంగూలీ ఆసక్తి
- వరల్డ్ కప్ అనంతరం కోచ్ పదవికి నోటిఫికేషన్ జారీ చేసిన బీసీసీఐ
- ప్రస్తుతం తనకు పోటీ చేసే అవకాశం లేదన్న గంగూలీ
బీసీసీఐ కొంతకాలం కిందట ఒకే వ్యక్తి రెండు, అంతకంటే ఎక్కువ పదవుల్లో కొనసాగడంపై ఆంక్షలు విధించింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాల నిబంధన తీసుకువస్తూ, ఏదో ఒక పదవిలోనే కొనసాగాలంటూ స్పష్టం చేసింది. ఇప్పుడు గంగూలీకి కూడా ఆ నిబంధనే అడ్డొస్తోంది.