సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- ప్రయోగాత్మక చిత్రంలో కాజల్
- 'డియర్ కామ్రేడ్'కి భారీ రీమేక్ రేటు
- అత్తాకోడళ్లుగా హీరోయిన్లు!
* విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన 'డియర్ కామ్రేడ్' చిత్రం మిశ్రమ స్పందనను తెచ్చుకుంది. కాగా, ఈ చిత్రాన్ని హిందీలోకి రీమేక్ చేయడానికి ఇప్పటికే ప్రముఖ బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జొహార్ హక్కులను తీసుకున్నాడు. ఇందుకు గాను ఆయన 6.2 కోట్లు చెల్లించినట్టు తెలుస్తోంది.
* తమిళ కథానాయకుడు ధనుశ్ తాజాగా నటిస్తున్న చిత్రం పేరు 'పటాస్'. ఇందులో ఆయన తండ్రీకొడుకులుగా డబుల్ రోల్స్ చేస్తున్నాడు. ఇక తండ్రి సరసన స్నేహ, కొడుకు సరసన మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారట.