నీతి ఆయోగ్ సీఈవోకి ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చిన ఏపీ సీఎంవో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
- స్థానికులకు అవకాశాలు పెంచేలా నిర్ణయం
- సమాఖ్య విధానానికి కలిగే నష్టమేమీ లేదు
- ఆ కథనం పూర్తిగా అసమగ్రమైనది
ఈ కథనాన్ని జత చేస్తూ నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్‌కాంత్ చేసిన ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అమితాబ్‌కాంత్ ట్వీట్‌పై స్పందించిన పీవీ రమేశ్ ఆ కథనం పూర్తిగా అసమగ్రమైనదంటూ కొట్టి పడేశారు. ఈ నిర్ణయం తీసుకోవడం వలన సమాఖ్య విధానానికి కలిగే నష్టమేమీ లేదన్నారు. దీనిపై తిరిగి అమితాబ్ కాంత్ స్పందించారు. ఆ పత్రిక కథనాన్ని మాత్రమే తాను పోస్ట్ చేశానని, ఆ వ్యాఖ్యలు తనవి కావని అన్నారు.