హిజ్రా తమన్నా హౌస్ లోకి ఎంటరవుతున్న వేళ... మిగతావారి రియాక్షన్ వీడియో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హిజ్రా తమన్నా హౌస్ లోకి ఎంటరవుతున్న వేళ... మిగతావారి రియాక్షన్ వీడియో!

  • నిన్న ఎలిమినేట్ అయిన హేమ
  • ఆ వెంటనే హౌస్ లోకి వచ్చిన తమన్నా
  • ఆశ్చర్యపోయిన కంటెస్టెంట్స్
టాలీవుడ్ రియాల్టీ షో బిగ్ బాస్ మూడో సీజన్ తొలి వారం వివాదాల నడుమ పూర్తికాగా, చివరి రోజున నటి హేమ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హిజ్రా తమన్నాను కంటెస్టెంట్ గా పరిచయం చేసిన నాగార్జున, తమన్నాను హౌస్ లోకి పంపించాడు. ఆ సమయంలో ఆమెను చూసిన హౌస్ మేట్స్ ఒక్కసారిగా అయోమయంలో పడ్డట్టు కనిపించింది. కొందరు ముక్కున వేలేసుకున్నారు. మరికొందరు ఆశ్చర్యంతో చూశారు. ఇంకొందరు తమ ముఖాల్లో హావభావాలు కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోను స్టార్ మా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. 
Hema
Biggboss
Tamannah
Hizra

More Telugu News