కేశినేనీ.. వెంటనే ఆ కుటుంబాలను ఆదుకో.. లేదంటే ...!: వైసీపీ నేత పీవీపీ
- కేశినేని ట్రావెల్స్ లక్ష్యంగా విమర్శలు
- ఆయన కంటే కసాయివాడే బెటరని వ్యాఖ్య
- కార్మికులకు అన్యాయం చేసి అందలమెక్కారని ఆగ్రహం
వేలాది మంది పొట్టకొట్టిన ఆయన ఈరోజు అందలమెక్కి కూర్చున్నారని విమర్శించారు. కడుపుకాలి, ఆ కడుపుమంటతో రోడ్డెక్కిన వేలాది కుటుంబాలను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే నీ బాస్ లాగా సంకనాకిపోతావని హెచ్చరించారు. ఈ మేరకు కేశినేని నాని ట్వీట్ చేశారు.
కొన్నేళ్ల క్రితం వరుస వివాదాలు చుట్టుముట్టడంతో కేశినేని ట్రావెల్స్ ను నిలిపివేస్తున్నట్లు నాని ప్రకటించారు. అప్పట్లో తమకు కొన్ని నెలలుగా జీతాలు ఇవ్వలేదని కొందరు కార్మికులు రోడ్డెక్కారు. తాజాగా ఆ విషయాన్నే పీవీపీ ప్రస్తావించినట్లు తెలుస్తోంది.