మరో ఐదేళ్ల తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తా: హీరో విజయ్ దేవరకొండ
- 35 ఏళ్లు వచ్చే వరకు పెళ్లి ఊసు లేదు
- అంతవరకు నటనపైనే దృష్టి
- బోరు కొడితే నటన కూడా మధ్యలో వదిలేస్తా
చర్చనీయాంశంగా మారిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలోని ముద్దు సన్నివేశం గురించి మాట్లాడుతూ సెట్‌లో అందరి ముందు ఇటువంటి సీన్స్‌లో నటించాలంటే కొంత ఇబ్బందేనన్నారు. అటువంటి పరిస్థితుల్లో హీరో, హీరోయిన్‌లు ఇద్దరూ సౌకర్యవంతంగా ఫీలైతేనే సీన్ పండుతుందని చెప్పారు. ఎటువంటి సన్నివేశమైనా నటులు ఇబ్బంది పడినా పర్వాలేదని, ప్రేక్షకులు ఇబ్బంది పడకూడదని చమత్కరించారు.