అధికారంలో ఉన్నా, లేకున్నా చంద్రబాబు బీసీలకు వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు!: విజయసాయిరెడ్డి
Add ap7am to your home Screen

అధికారంలో ఉన్నా, లేకున్నా చంద్రబాబు బీసీలకు వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు!: విజయసాయిరెడ్డి

  • సీఎంగా ఉన్నప్పుడు బీసీలు జడ్జీలు కాకుండా అడ్డుకున్నారు
  • ఇప్పుడు 50 శాతం రిజర్వేషన్ బిల్లుకు అడ్డంకులు సృష్టిస్తున్నారు
  • ట్విట్టర్ లో మండిపడ్డ వైసీపీ నేత
అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా చంద్రబాబు బీసీలకు వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారని వైసీపీ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బీసీలు న్యాయమూర్తులు కాకుండా చంద్రబాబు అడ్డంకులు సృష్టించారని విమర్శించారు. ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనారిటీలకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లుకు అడ్డంకులు కల్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
Andhra Pradesh
Chandrababu
Vijay Sai Reddy
YSRCP
Telugudesam
Twitter

More Telugu News