మోదీ, షా ఆదేశిస్తే మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం 24 గంటలు కూడా నిలవదు!: బీజేపీ నేత గోపాల్ భార్గవ్
- కర్ణాటకలో కూలిన కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం
- ఇప్పుడు ఉత్తరాదిపై దృష్టి పెట్టిన బీజేపీ
- కీలక వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ ప్రతిపక్ష నేత
బీజేపీలోని నంబర్ 1(ప్రధాని మోదీ) నంబర్ 2( హోంమంత్రి అమిత్ షా) నుంచి ఆదేశాలు వస్తే మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం 24 గంటలు కూడా మనుగడ సాగించలేదని హెచ్చరించారు. కాగా, ఈ హెచ్చరికలపై సీఎం కమల్ నాథ్, ఇతర కాంగ్రెస్ నేతలు ఇంతవరకూ స్పందించలేదు.