నా యువరాణికి జన్మదిన శుభాకాంక్షలు: రామ్ చరణ్
- ఉపాసన బర్త్ డేకి ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు పెట్టిన రామ్ చరణ్
- పార్కులో ఉయ్యాల ఊగుతున్న ఉపాసన
- దేవుడు సుఖసంతోషాలతో దీవించాలంటూ కామెంట్
తన అర్ధాంగి ఉపాసన బర్త్ డేని పురస్కరించుకుని ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఫొటో పోస్టు చేశాడు. ఓ పార్కులో చిన్నపిల్లలా ఉయ్యాల ఊగుతున్న ఉపాసనను ఆ ఫొటోలో చూడొచ్చు. నా యువరాణికి జన్మదిన శుభాకాంక్షలు. దేవుడు సుఖసంతోషాలతో దీవించాలని కోరుకుంటున్నాను అంటూ కామెంట్ చేశాడు. ఈ పోస్టుకు కొద్ది వ్యవధిలోనే భారీ రెస్పాన్స్ వచ్చింది. అభిమానులు లైకులు, షేర్లతో సందడి చేస్తున్నారు.