ముఖ్యమంత్రి గారూ.. వెంటనే రోడ్లు మరమ్మతులు చేయించండి సార్!: కేశినేని నాని
- విజయవాడలో రోడ్లు దారుణంగా తయారయ్యాయి
- నగరవాసులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
- ట్విట్టర్ లో స్పందించిన టీడీపీ ఎంపీ
ఈ రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కోరారు. విజయవాడ పాలఫ్యాక్టరీ వద్ద ఉన్న చనమోలు వెంకట్రావు పైవంతెన ఫొటోతో ప్రచురితమైన ఓ పత్రికా కథనాన్ని ఈ ట్వీట్ కు కేశినేని నాని జతచేశారు. తన ట్వీట్ కు ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో పాటు విజయవాడ మున్సిపల్ కమిషనర్ ను కేశినేని ట్యాగ్ చేశారు.