అభిమానులకు ఆర్థికసాయం చేసిన పవన్ కల్యాణ్
Add ap7am to your home Screen

అభిమానులకు ఆర్థికసాయం చేసిన పవన్ కల్యాణ్

  • పెద్ద మనసు చాటుకున్న పవన్
  • క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి రెండు లక్షల సాయం
  • మంచానికి పరిమితమైన మరోవ్యక్తికి లక్ష సాయం
కష్టాల్లో ఉన్న తన అభిమానులకు సాయం చేయడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎప్పుడూ ముందుంటారు. సినీ పరిశ్రమలోని వారికి, పార్టీ కార్యకర్తలకు, బయట వ్యక్తులకు ఆయన సాయం చేసిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా మరో ఇద్దరికి ఆర్థిక సాయం చేసి, బాసటగా నిలిచారు.

విజయనగరం జిల్లాకు చెందిన విశ్వతేజ అనే జనసేన కార్యకర్త క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ విషయాన్ని పార్టీ వ్యక్తుల ద్వారా తెలుసుకున్న పవన్... వెంటనే వైద్య ఖర్చుల నిమిత్తం ఆయనకు రెండు లక్షల చెక్ పంపించారు. ఇదే విధంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ మంచానికి పరిమితమైన గుబ్బాల సతీష్ (ఖమ్మం జిల్లా) అనే యువకుడికి కూడా లక్ష రూపాయల చెక్ పంపించారు.
pawan kalyan
help
janasena

More Telugu News