విజయసాయిరెడ్డి గారూ.. అందుకే మీకు 16 నెలలు శ్రీకృష్ణ జన్మస్థానప్రాప్తి అయింది!: బుద్ధా వెంకన్న సెటైర్లు
- దొంగలెక్కలు రాయడంలో మీరు సిద్ధహస్తులు
- కిన్లే వాటర్ బాటిళ్లతో ప్రజల దృష్టిని మళ్లించారు
- దొడ్డిదారిన జీవోలతో ప్రజాధనాన్ని దోచుకున్నారు
ఈరోజు ట్విట్టర్ లో బుద్ధా వెంకన్న స్పందిస్తూ..‘అవకాశం దొరకాలే కానీ మీరు ఎక్కడైనా దొంగలెక్కలు రాయగల సిద్ధహస్తులు విజయసాయిరెడ్డి గారు. అందుకే కదా 16 నెలల కృష్ణాజన్మస్థాన ప్రాప్తి అయ్యింది. ప్రజలను కిన్లే వాటర్ బాటిల్ తో ఏమార్చి, దొడ్డిదారిన జీవోలతో ప్రజాధనాన్ని బొక్కడమే కదా మీ ప్రత్యేకత’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు ఓ ఫొటోను ఆయన జతచేశారు.