ముంబైలో పాత ఫ్లాట్ కోసం భారీ రేటు వెచ్చించిన తమన్నా!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ముంబైలో పాత ఫ్లాట్ కోసం భారీ రేటు వెచ్చించిన తమన్నా!

  • తమన్నాకి తగ్గిన అవకాశాలు
  • ఇతర భాషల్లోను పోటీ పడుతోన్న తమన్నా
  • వరుసగా ఫ్లాట్ల కొనుగోళ్లు     
తెలుగు .. తమిళ భాషల్లో స్టార్ హీరోలతో తమన్నా వరుస సినిమాలు చేసేసింది. హిందీ తెరకి కూడా తన మార్క్ గ్లామర్ ను పరిచయం చేసింది. ప్రస్తుతం పోటీ ఎక్కువగా ఉండటంతో, వచ్చిన అవకాశాన్ని వచ్చినట్టుగా ఒప్పేసుకుంటోంది. దీపం ఉండగానే ఒక ఇల్లే కాదు .. చాలా ఇళ్లు చక్కబెట్టేసింది. హైదరాబాద్ .. చెన్నై .. బెంగుళూర్ .. ముంబైలలో ఖరీదైన ఫ్లాట్లు కొనేసింది.

తాజాగా ముంబైలోనే మరో ఫ్లాట్ ను కొనుగోలు చేసిందట. ఆ ఏరియాలో కొత్తగా కట్టిన ఫ్లాట్ రేటు 10 కోట్ల లోపే వుంటే, ఒక పాత ఫ్లాట్ ను ఆమె 16 కోట్లకి కొనడం హాట్ టాపిక్ గా మారింది. అక్కడి నుంచి చూస్తే దూరంగా సముద్రం చాలా అందంగా కనిపిస్తుందట. అందమైన ఆ వ్యూ కోసమే అంత పెట్టానని తమన్నా చెబుతోందట. మరో రెండు కోట్లు పెట్టి తన అభిరుచికి తగినట్టుగా ఆ ఫ్లాట్ ను తీర్చిదిద్దుతోందట.
tamannah

More Telugu News