వేరే రాజ్యాంగం ఏమైనా టీడీపీ రాసుకుందేమో!: జీవీఎల్ సెటైర్లు
- విలీనం అనేది పూర్తిగా రాజ్యాంగబద్ధంగా జరిగింది
- మాకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తే ఆస్కారం లేదు
- టీడీపీ వితండ వాదన చేస్తోంది
ఆరుగురు రాజ్యసభ సభ్యులు ఉన్న టీడీపీలో మూడింట రెండు వంతులు అంటే ఆరుగురిలో నలుగురు కలిసి వస్తే విలీనం కింద ట్రీట్ చేయబడుతుందని, ఈ విషయాన్ని షెడ్యూల్ 10 లో పార్ట్ 4 లో స్పష్టంగా చెప్పారని అన్నారు. టీడీపీ వితండ వాదన చేస్తోందని, టీడీపీ చేసే ప్రయత్నాలు కేవలం కంటితుడుపు చర్యలేనని అన్నారు. ఈ విషయమై టీడీపీ న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని భావించడం వారి హక్కు అని, దానికి తామెందుకు అడ్డు చెబుతామని అన్నారు. విలీనం అనేది పూర్తిగా రాజ్యాంగబద్ధంగా జరిగిన చర్య కనుక తమకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తే ఆస్కారం లేదని స్పష్టం చేశారు.