చంద్రబాబు విదేశాల నుంచి వచ్చేలోపు ఏపీ ముఖచిత్రం మారిపోతుంది!: బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి నర్మగర్భ వ్యాఖ్యలు
- టీడీపీలో బానిసత్వం, వారసత్వం
- దాని నుంచి బయటపడాలని నేతలు కోరుకుంటున్నారు
- త్వరలోనే బీజేపీలోకి భారీగా చేరికలు
చంద్రబాబు విదేశాల నుంచి వచ్చేలోపు ఏపీ ముఖచిత్రం మారిపోతుందని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. వారసత్వం, బానిసత్వం నుంచి బయటపడాలని టీడీపీ నేతలు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పటికే జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి తో పాటు పలువురు టీడీపీ నేతలతో బీజేపీ ముఖ్యనేతలు సమావేశం అయ్యారన్న వార్తల నేపథ్యంలో విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యలకు ప్రాధాన్యత నెలకొంది.