'పుంబా'కు బ్రహ్మానందం, 'టిమోన్'కు అలీ గాత్రదానం!

  • త్వరలో రానున్న 'ద లయన్ కింగ్'
  • తెలుగు వర్షన్ కు ప్రముఖుల డబ్బింగ్
  • జంతువుల క్యారెక్టర్లకు అదనపు ఆకర్షణ
ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ డిస్నీ రూపొందించిన యానిమేటెడ్ చిత్రం 'ద ల‌య‌న్ కింగ్‌'కు మరిన్ని ఆకర్షణలు జోడయ్యాయి. ఈ సినిమాలోని జంతువుల క్యారెక్టర్లకు పలువురు తెలుగు నటీనటులు డబ్బింగ్ చెప్పేందుకు అంగీకరించగా, ఆ జాబితాలో బ్ర‌హ్మానందం, అలీ వచ్చి చేరారు. చిన్నారులకు ఎంతో ఇష్టమైన 'పుంటా' (అడవి పంది)కు బ్రహ్మానందం, 'టిమోన్' (ముంగీస)కు అలీ డబ్బింగ్ చెప్పారు. 'ది జంగిల్ బుక్‌', 'ఐర‌న్ మ్యాన్‌' సినిమాల ద‌ర్శ‌కుడు జాన్ ఫేవ‌రోవ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల కానుంది. సినిమాలోని కీలకమైన ముఫాసా, సింబా అనే సింహాల క్యారెక్టర్లకు ఎవరితో డబ్బింగ్ చెప్పించారో అధికారికంగా వెల్లడించలేదు.
Go Back to Shorts
The Lion King
Pumba
Timon
Brahmanandam
Ali

More Telugu News