కొరటాల సూచన మేరకు బరువు తగ్గనున్న చిరూ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొరటాల సూచన మేరకు బరువు తగ్గనున్న చిరూ

  • 'సైరా' పనులతో బిజీగా చిరూ 
  • తదుపరి సినిమా కొరటాలతో 
  • వినోదం ప్రధానంగా సాగే సందేశాత్మక చిత్రం
ప్రస్తుతం చిరంజీవి 'సైరా' సినిమా పనులతో బిజీగా వున్నారు. అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఈ సినిమా తరువాత ఆయన కొరటాల శివతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నారు. చిరంజీవి కథానాయకుడిగా ఒక సందేశాత్మక చిత్రాన్ని రూపొందించడానికి కొరటాల సిద్ధంగా వున్నారు.

కథలో సందేశం ఉన్నప్పటికీ, చిరంజీవి మార్క్ ఫైట్లు .. డాన్సులు ఉంటాయట. అందువలన బరువు తగ్గవలసిందిగా చిరంజీవికి కొరటాల సూచించినట్టుగా సమాచారం. 'సైరా'లో పాత్ర పరంగా బరువు పెరిగిన చిరంజీవి, కొరటాల సినిమా కోసం బరువు తగ్గనున్నారు. ఆల్రెడీ ఆయన జిమ్ కి వెళుతూ కసరత్తులు మొదలెట్టేశారని అంటున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.
chiru
Koratala Siva

More Telugu News