ప్రపంచకప్: వార్నర్ సెంచరీ.. ఆసీస్ చేతిలో పాక్ చిత్తు

13-06-2019 Thu 06:34 | Sports
  • లక్ష్య ఛేదనలో చతికిల పడిన పాక్
  • ప్రపంచకప్‌లో రెండో ఓటమి
  • సెంచరీ వీరుడు వార్నర్‌కే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు
ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం టాంటన్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 307 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్లు అరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్‌లు దూకుడుగా ఆడారు. తొలి వికెట్‌కు 146 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఫించ్ 84 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 82 పరుగులు చేయగా, డేవిడ్ వార్నర్ సెంచరీ బాదాడు. 111 బంతుల్లో 11  ఫోర్లు, సిక్సర్‌తో 107 పరుగులు చేశాడు. అయితే, జట్టులో ఈ ఇద్దరు మినహా మరెవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. ఫించ్ తర్వాత షాన్ మార్స్ చేసిన 23 పరుగులే అత్యధికం. పాక్ బౌలర్ మహ్మద్ ఆమిర్ ధాటికి ఆసీస్ టాపార్డర్ పేకమేడలా కుప్పకూలింది. పది ఓవర్లు వేసి 30 పరుగులు మాత్రమే ఇచ్చిన ఆమిర్ 5 వికెట్లు పడగొట్టాడు.

అనంతరం 308 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్ 45.4 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ ఇమాముల్ హక్ 53 పరుగులతో ఆకట్టుకున్నప్పటికీ సరైన భాగస్వామ్యాలు లేకపోవడం జట్టును దెబ్బతీసింది. హక్ 53, బాబర్ ఆజం 30, మహ్మద్ హఫీజ్ 46, సర్ఫరాజ్ అహ్మద్ 40, హసన్ అలీ 32, వాహబ్ రియాజ్ 45 పరుగులు చేశారు. పాక్ ఆటగాళ్లలో ముగ్గురు డకౌట్ అయ్యారు. ఆసీస్ బౌలర్లు వరుసపెట్టి వికెట్లు తీసి పాక్‌ను ఒత్తిడిలోకి నెట్టేశారు. దీంతో పాక్ 266 పరుగులకే కుప్పకూలి 41 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

ఆసీస్ బౌలర్లలో పాట్ కమిన్స్ 3 వికెట్లు తీసుకోగా, మిచెల్ స్టార్క్, రిచర్డ్‌సన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. కల్టర్ నైల్, అరోన్ ఫించ్‌లకు ఒక్కో వికెట్ దక్కింది. సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన డేవిడ్ వార్నర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.

నాలుగు మ్యాచ్‌లు ఆడిన పాకిస్థాన్‌కు ఇది రెండో ఓటమి కాగా, వర్షం కారణంగా ఓ మ్యాచ్ రద్దు అయింది. పాకిస్థాన్ మూడు పాయింట్లతో కింది నుంచి మూడో స్థానంలో ఉండగా, నాలుగు మ్యాచ్‌లు ఆడి మూడు విజయాలు సాధించిన ఆసీస్ రెండో స్థానంలో ఉంది.
ICC World CupAustraliaPakistan

More Telugu News

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03
..more