ఓటమి దిశగా పాకిస్థాన్... చెలరేగిన కమిన్స్
- 33 ఓవర్లలో పాక్ స్కోరు 6 వికెట్లకు 191
- కమిన్స్ కు 3 వికెట్లు
- ఇమాముల్ హక్ అర్ధసెంచరీ
నిలకడగా ఆడుతున్న ఓపెనర్ ఇమాముల్ హక్ హాఫ్ సెంచరీ పూర్తికాగానే కమిన్స్ బౌలింగ్ లో అవుటయ్యాడు. ఆ తర్వాత మహ్మద్ హఫీజ్ కూడా వెనుదిరిగాడు. ఆదుకుంటాడనుకున్న షోయబ్ మాలిక్ కనీసం పరుగుల ఖాతా కూడా తెరవలేకపోయాడు. ఈ వికెట్ కూడా కమిన్స్ కే దక్కింది. ప్రస్తుతం పాక్ గెలవాలంటే 17 ఓవర్లలో 117 పరుగులు చేయాలి. చేతిలో మరో 4 వికెట్లు మాత్రమే మిగిలున్న స్థితిలో పాక్ విజయం అసాధ్యంగానే కనిపిస్తోంది.