పెదవులకు సర్జరీపై వెనక్కి తగ్గా.. సాయి పల్లవిని చూసి నేర్చుకున్నా: నివేదా పేతురాజ్
- సినిమాలు వదిలేసి హిమాలయాలకు వెళ్లాలనుకున్ననన్న నివేదా
- తీవ్ర డిప్రెషన్, పానిక్ అటాక్స్‌తో ఇబ్బంది పడ్డానని వెల్లడి
- పెదవులకు సర్జరీ చేయించుకోవాలనుకుని వెనక్కి తగ్గానని వ్యాఖ్య
- సాయి పల్లవి, నిత్యామీనన్‌ల వల్లే ఆ ఆలోచన మారిందన్న నటి
- ప్రస్తుతం ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంలో కీలక పాత్రల్లో నివేదా
‘మెంటల్ మది’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి నివేదా పేతురాజ్, తన కెరీర్‌కు సంబంధించి కొన్ని సంచలన విషయాలను బయటపెట్టారు. ఒకానొక దశలో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురై, నటనకు పూర్తిగా గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఒకవేళ మళ్లీ అవకాశాలు రాకపోతే హిమాలయాలకు వెళ్లి ధ్యానం చేసుకుంటూ గడపాలని కూడా భావించినట్లు ఆమె చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆమె త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
నివేదా తాజాగా తన గతాన్ని గుర్తుచేసుకుంటూ, 2023లో కొన్ని తప్పుడు నిర్ణయాలు, వ్యక్తిగత కారణాల వల్ల తీవ్రమైన డిప్రెషన్‌తో పాటు పానిక్ అటాక్స్‌ను ఎదుర్కొన్నానని వెల్లడించారు. ఆ పరిస్థితుల నుంచి బయటపడటానికి చాలా సమయం పట్టిందని, ఆ సమయంలోనే సినిమాలకు దూరమవ్వాలనే ఆలోచన వచ్చిందని చెప్పారు. అదృష్టవశాత్తూ పరిస్థితులు అనుకూలించి మళ్లీ అవకాశాలు రావడంతో నటనపై దృష్టి సారించినట్లు వివరించారు.
అంతేగాక కెరీర్ ఆరంభంలో తన రూపంపై అసంతృప్తితో పెదవులకు సర్జరీ చేయించుకోవాలని కూడా ఆలోచించినట్లు నివేదా తెలిపారు. ఈ విషయం గురించి తన వైద్యుడిని సంప్రదించగా, ఆయన తీవ్రంగా మందలించారని, భవిష్యత్తులో వచ్చే ఆరోగ్య సమస్యల గురించి హెచ్చరించడంతో ఆ ఆలోచనను విరమించుకున్నానని అన్నారు.
“సహజ సౌందర్యంతోనే సాయి పల్లవి, నిత్యామీనన్ వంటి నటీమణులు ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. వారిని చూశాక, నా రూపం గురించి నేను అనవసరంగా ఎందుకు ఆందోళన చెందుతున్నానో అర్థమైంది” అని నివేదా పేర్కొన్నారు.
ఈ సందర్భంగా తనకో విచిత్రమైన అనుభవం ఉందని, తాను ప్రతికూలంగా ఏదైనా ఊహించుకుంటే అది నిజమవుతుందని నివేదా పంచుకున్నారు. తన మాజీ ప్రియుడి విషయంలోనూ ఇలాంటిదే జరిగిందని, ఆ తర్వాత నుంచి ఎక్కువగా ఆలోచించడం మానేశానని ఆమె తెలిపారు. కష్టకాలం నుంచి బయటపడి ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అవ్వడం సంతోషంగా ఉందని నివేదా అన్నారు.