దర్శకుడు శంకర్ లో విషయం లేదు!: హాస్యనటుడు వడివేలు

  • శంకర్ సినిమాల్లో చేసిన వడివేలు
  •  చాలాకాలం నుంచి మనస్పర్థలు
  • శంకర్ ను కామెంట్ చేసిన వడివేలు   
దక్షిణాది అగ్రదర్శకుల జాబితాలో శంకర్ ముందువరుసలో కనిపిస్తాడు. భారీ సినిమాలు .. భారీ విజయాలు ఆయన ఖాతాలో కనిపిస్తాయి. అలాంటి శంకర్ గొప్ప దర్శకుడేమీ కాదని అంటున్నాడు హాస్యనటుడు వడివేలు. గతంలో శంకర్ తన సినిమాల్లో వడివేలుకు చాలా అవకాశాలు ఇచ్చాడు. ఆయన హీరోగా 'హింసించే 23వ రాజు పులకేశి'ని శంకర్ నిర్మించాడు.

ఈ సినిమా నుంచే ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తినట్టుగా అప్పట్లో ప్రచారం జరిగింది. అది నిజమేనన్నట్టుగా వడివేలు అడపాదడపా శంకర్ పై ఏవో కామెంట్స్ చేస్తూనే వచ్చాడు. తాజా ఇంటర్వ్యూలోను ఆయన మాట్లాడుతూ .. "శంకర్ కేవలం గ్రాఫిక్స్ డైరెక్టర్ మాత్రమే. గ్రాఫిక్స్ కి సంబంధించిన సన్నివేశాలతోనే కెరియర్ ను నెట్టుకొస్తున్నాడు. అంతకి మించి ఆయనలో పెద్దగా విషయం లేదు" అని అన్నాడు. ఇప్పుడు ఇదే విషయం కోలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. 
Go Back to Shorts
vadivelu
shankar

More Telugu News