మీడియా ముందు విలపించిన తమిళ నటి మీరా మిథున్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మీడియా ముందు విలపించిన తమిళ నటి మీరా మిథున్!

  • రద్దయిన అందాల పోటీలు
  • ఏర్పాట్లు చేసుకున్న తరువాత హ్యాండిచ్చిన ఆర్గనైజర్లు
  • మరోసారి నిర్వహించి తీరుతానన్న మీరా
తాను నిర్వహించతలపెట్టిన అందాల పోటీలు రద్దు కావడంతో తమిళ నటి, 2016 మిస్ సౌత్ ఇండియా మీరా మిథున్, మీడియా ముందు కన్నీరు పెట్టుకుంది. ఎన్నో రోజులు రాత్రింబవళ్లూ కష్టపడి ఈ పోటీలకు ఏర్పాట్లు చేసుకున్నానని, పోటీల్లో పాల్గొనేందుకు 11 మంది సిద్ధమయ్యారని మీడియాకు చెప్పిన ఆమె, ఈవెంట్ ఆర్గనైజర్లు తనను మోసం చేశారని అన్నారు. వారికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదని, తానే స్వయంగా వారి వద్దకు వెళితే, అందాల పోటీలు నిర్వహించకూడదని చెప్పారని, ఇద్దరు పోలీసులను పంపి బెదిరించారని వాపోయారు.

కాగా, ఈ పోటీలు నిర్వహించరాదని, గతంలో మీరాకు అందాల కిరీటాన్ని అందించిన మిస్ సౌత్ ఇండియా పోటీల నిర్వాహకులు గతంలోనే తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. అయినా ఆమె వెనక్కు తగ్గక పోవడంతో ఆ కిరీటాన్ని వెనక్కు తీసేసుకుంటున్నామని అప్పట్లో రెండో స్థానంలో నిలిచిన సనంశెట్టికి ఇస్తున్నామని ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, తాను మరోసారి ఇవే పోటీలను నిర్వహించి తీరుతానని మీరా మిథున్ మీడియాకు తెలిపారు.
Beauty Pegent
Meera Midhun
Chennai

More Telugu News