తన కోరిక తీరిస్తే.. ఆ సినిమాలో ఛాన్స్ ఇస్తానన్నాడు: ప్రముఖ దర్శకుడిపై తమిళ నటి షమ్ము ఆరోపణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తన కోరిక తీరిస్తే.. ఆ సినిమాలో ఛాన్స్ ఇస్తానన్నాడు: ప్రముఖ దర్శకుడిపై తమిళ నటి షమ్ము ఆరోపణ

  • విజయ్ దేవరకొండతో తీసే సినిమాలో చాన్స్ ఇస్తానన్నాడు 
  • వేధింపుల్ని ఎలా ఎదుర్కోవాలో తెలుసు
  • ఫిర్యాదు చేసినా ఉపయోగం లేదు
ఓ ప్రముఖ దర్శకుడు తన కోరిక తీర్చితే విజయ్ దేవరకొండతో తాను తీయబోయే సినిమాలో అవకాశం కల్పిస్తానన్నాడని ప్రముఖ కోలీవుడ్ నటి షమ్ము ఆరోపించింది. ఇటీవల ఈ ముద్దుగుమ్మ శివ కార్తికేయన్ సినిమా ‘మిస్టర్ లోకల్’ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కాసేపు నెటిజన్లతో ముచ్చటించింది. నెటిజన్లు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానమిచ్చింది.

ఈ క్రమంలో ఓ నెటిజన్ చిత్ర పరిశ్రమలోని లైంగిక వేధింపుల గురించి ప్రస్తావిస్తూ, 'మీకు ఎప్పుడైనా అలాంటి సందర్భం ఎదురైందా?' అని ప్రశ్నించాడు. ఆ వేధింపుల కారణంగా ఏమైనా అవకాశాలు కోల్పోయారా? అని ప్రశ్నించాడు. దీనికి షమ్ము, తాను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని, అయితే వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసు కాబట్టి ఫిర్యాదు చేయనన్నారు. ఒకవేళ ఫిర్యాదు చేసినా ఉపయోగం లేదని, ఎదుటి వ్యక్తి తన తప్పును ఒప్పుకోడని పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రితం ఓ ప్రముఖ దర్శకుడు తన కోరిక తీరిస్తే, తాను విజయ్ దేవరకొండతో తెరకెక్కించబోయే సినిమాలో అవకాశం కల్పిస్తానన్నాడని షమ్ము ఆరోపిస్తూ బాంబు పేల్చింది. అయితే ఆ దర్శకుడి పేరు మాత్రం వెల్లడించలేదు.
Shammu'
Colly Wood
Vijay Devarakonda
Shiva Karthikeyan
Netizens

More Telugu News