ఆసుపత్రిలో మురళీమోహన్ ను పరామర్శించిన టీఆర్ఎస్ నేతలు
- కేర్ ఆసుపత్రికి వచ్చిన తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి
- మురళీమోహన్ కు పరామర్శ
- త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్ష
ఈ విషయాన్ని మురళీమోహన్ తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. ఇటీవల ఎన్నికల్లో పోటీచేయకుండా తన కోడలిని రంగంలోకి దింపిన మురళీమోహన్, తల్లి అస్థికలు గంగలో నిమజ్జనం చేసేందుకు అలహాబాద్ వెళ్లి అక్కడ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రెండు కాళ్లు బిగుసుకుపోయి నడవలేని స్థితిలో హైదారబాద్ కేర్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఆయన వెన్నుపూసలో పలు చోట్ల సమస్యలు ఉన్నట్టు గుర్తించిన వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు.