ఫ్లాప్ ఇచ్చానని ప్రభాస్ నన్నెప్పుడూ తక్కువగా చూడలేదు: దర్శకుడు వంశీ పైడిపల్లి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫ్లాప్ ఇచ్చానని ప్రభాస్ నన్నెప్పుడూ తక్కువగా చూడలేదు: దర్శకుడు వంశీ పైడిపల్లి

  • ప్రభాస్ నాతో ఆత్మీయంగా ఉంటాడు 
  • ఆయన కోసం మంచి స్క్రిప్ట్ సిద్ధం చేస్తాను
  •  ప్రభాస్ తో హిట్ సినిమా చేస్తాను
ఇప్పుడు ఎక్కడ చూసినా అంతా 'మహర్షి' సినిమాను గురించి, దర్శకుడు వంశీ పైడిపల్లిని గురించే మాట్లాడుకుంటున్నారు. 'బృందావనం'తో ఎన్టీఆర్ కి .. 'ఎవడు'తో చరణ్ కి .. 'మహర్షి'తో మహేశ్ బాబుకి హిట్స్ ఇచ్చాడని చెప్పుకుంటున్నారు. అయితే వంశీ పైడిపల్లికి ప్రభాస్ తో హిట్ కొట్టలేకపోవడమే అసంతృప్తిని కలిగిస్తుందేమో, ఆయనకి తప్పకుండా హిట్ ఇవ్వాలనుకుంటున్నట్టు చెప్పాడు.

వంశీ పైడిపల్లి మొదటి సినిమా హీరో ప్రభాస్. 'మున్నా' టైటిల్ తో 2007లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పరాజయం పాలైంది. తాజా ఇంటర్వ్యూలో వంశీ పైడిపల్లి ఈ విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ, " సాధారణంగా కొంతమంది హీరోలు తమకి ఫ్లాప్ ఇచ్చిన దర్శకులను పక్కకి పెట్టడం .. తక్కువగా చూడటం చేస్తుంటారు. కానీ నన్ను ప్రభాస్ ఎప్పుడూ అలా చూడలేదు. ఆయన నాతో ఎంతో ఆత్మీయంగా .. గౌరవంగా వుండేవాడు. అలాంటి ప్రభాస్ కోసం త్వరలో మంచి స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తాను .. ఆయనను ఒప్పించి ఒక సూపర్ హిట్ మూవీ చేస్తాను" అని చెప్పుకొచ్చాడు. 
vamsi paidipalli

More Telugu News