నాకెందుకో అనిల్ రావిపూడి హీరో అవుతాడనిపిస్తోంది: పరుచూరి గోపాలకృష్ణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాకెందుకో అనిల్ రావిపూడి హీరో అవుతాడనిపిస్తోంది: పరుచూరి గోపాలకృష్ణ

  • దర్శకుల సంఘం ఫంక్షన్ కి వెళ్లాను
  •  స్టేజ్ పై అనిల్ రావిపూడి యాక్టింగ్ చూశాను
  •  ఆయనలో మంచి నటుడు వున్నాడు
తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో దర్శకుడు అనిల్ రావిపూడిని గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు. " దర్శకుల సంఘం వారు ఇటీవల ఒక ఫంక్షన్ చేశారు. ఆ వేడుకకి నేను వెళ్లేసరికి హరీశ్ శంకర్ .. అనిల్ రావిపూడి కలిసి ఒక స్కిట్ చేస్తున్నారు. ఆ స్కిట్ ను అనిల్ రావిపూడి చాలా గమ్మత్తుగా చేశాడు. ఆ స్కిట్ చూస్తున్నంత సేపు ఆయనలో మంచి నటుడు వున్నాడనిపించింది.

సిద్ధార్థ్ దర్శక శాఖ నుంచే హీరో అయ్యాడు. అలాగే రవితేజ .. నాని కూడా దర్శక శాఖలో పనిచేసి ఆ తరువాత హీరోలయ్యారు. ఆ లైన్లో ఇప్పుడు అనిల్ రావిపూడి వున్నట్టుగా నాకు అనిపిస్తోంది. మొన్న వేదికపై అనిల్ రావిపూడి డైలాగ్ డెలివరీ .. ఎక్స్ ప్రెషన్ చూసినప్పుడు ఆయన త్వరలో హీరో అవుతాడనిపించింది. సాధారణంగా నటించేటప్పుడు చేతులను కిందికి వదిలేయకుండా ఏం చేయాలో తెలిసినవాళ్లు మంచి నటులవుతారని అంటారు. అలాంటి ఇబ్బందేమీ లేకుండా అనిల్ రావిపూడి చాలా చక్కగా చేశాడు" అని చెప్పుకొచ్చారు.
paruchuri
anil ravipudi

More Telugu News