తెలుగులో భారీ లాభాలను తెచ్చిపెట్టిన 'కాంచన 3'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలుగులో భారీ లాభాలను తెచ్చిపెట్టిన 'కాంచన 3'

  • హారర్ థ్రిల్లర్ చిత్రాల దర్శకుడిగా లారెన్స్ 
  • తెలుగు .. తమిళ భాషల్లో ఆయన సినిమాలకి క్రేజ్ 
  • బి - సి సెంటర్స్ లో భారీ వసూళ్లు
నృత్యదర్శకుడిగానే కాదు, నటుడిగా .. దర్శకుడిగా కూడా లారెన్స్ తానేమిటన్నది నిరూపించుకున్నాడు. హారర్ థ్రిల్లర్ చిత్రాలను తెరకెక్కించడంలోను .. ఉత్కంఠభరితంగా ఆ కథలను నడిపించడంలోను లారెన్స్  సిద్ధహస్తుడు. అందువలన ఆయన నుంచి వరుసగా వస్తున్న హారర్ థ్రిల్లర్ సినిమాలకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. భారీ విజయాలను దోసిట్లో పెడుతున్నారు.ఈ నేపథ్యంలోనే ఆయన తాజా చిత్రంగా 'కాంచన 3' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు .. తమిళ భాషల్లో 100 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. 4 వారాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా, తెలుగులో భారీ లాభాలను తెచ్చిపెట్టిందని అంటున్నారు. తెలుగులో ఈ సినిమాను 'ఠాగూర్' మధు విడుదల చేశారు. వసూళ్ల పరంగా బి - సి సెంటర్స్ లో దుమ్మురేపేసిన ఈ సినిమా, అన్ని ఖర్చులుపోను ఆయనకి 10 కోట్ల లాభం తెచ్చిపెట్టినట్టు తెలుస్తోంది. నెగిటివ్ టాక్ తో ఈ సినిమా ఈ స్థాయి లాభాలను తీసుకురావడం గురించే ఫిల్మ్ నగర్లో మాట్లాడుకుంటున్నారు.
lawrence

More Telugu News