ఇప్పుడు చెబుతున్నా రాసుకోండి... బీజేపీకి 300 సీట్లు తగ్గవు: అమిత్ షా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇప్పుడు చెబుతున్నా రాసుకోండి... బీజేపీకి 300 సీట్లు తగ్గవు: అమిత్ షా

  • ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటేశాం
  • చివరి దశ పోలింగ్ తర్వాత మరిన్ని సీట్లు వస్తాయి
  • మరోసారి మోదీ ప్రధాని అవుతారు
ఈ ఎన్నికల్లో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు కాషాయదళం జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎంతో ఆత్మవిశ్వాసంతో బదులిచ్చారు. ఆరో విడత పోలింగ్ పూర్తయ్యేనాటికి బీజేపీ మ్యాజిక్ ఫిగర్ (272) దాటేసిందని, చివరి విడత పోలింగ్ తో తమ పార్టీకి 300 సీట్లకు పైగా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

"ఎన్ని సీట్లు వస్తాయని మీరు (మీడియా) పదేపదే అడుగుతున్నారు. నేను దేశవ్యాప్తంగా పర్యటించి ప్రజల నాడి ఎలా ఉందో చూశాను. ఐదు, ఆరు విడతల పోలింగ్ నాటికే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ దాటేసింది. ఇప్పుడు ఏడో దశ పోలింగ్ తర్వాత బీజేపీ మెజారిటీ 300 సీట్లు దాటుతుంది. తద్వారా మరోసారి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటవుతుంది" అని స్పష్టం చేశారు.
Amit Shah
BJP
Narendra Modi

More Telugu News