తమన్నాతో కలిసి నటించాలని ఉందన్న కాజల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తమన్నాతో కలిసి నటించాలని ఉందన్న కాజల్

  • తమన్నా .. కాజల్ మంచి స్నేహితులు
  •  కాజల్ తాజా చిత్రంగా రానున్న 'సీత'
  • 'ఖామోషి'తో పలకరించనున్న తమన్నా  
తెలుగు .. తమిళ ప్రేక్షకుల మనసులను దోచుకున్న అందమైన భామలుగా కాజల్ .. తమన్నాలకి మంచి క్రేజ్  వుంది. గ్లామర్ పరంగా .. నటన పరంగా ఇద్దరూ మంచి మార్కులు కొట్టేసినవారే. సుదీర్ఘ కాలంగా తమ కెరియర్ ను పరుగులు తీయిస్తున్నవారే. ఈ సుందరీమణులిద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరూ ఎక్కడైనా కలిశారంటే ఈ లోకాన్ని మరిచిపోతుంటారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ, కాజల్ తో కలిసి నటించాలని ఉందని చెప్పింది. ఈ విషయం తన దృష్టికి రావడంతో కాజల్ కూడా స్పందించింది. తమన్నాతో కలిసి నటించడానికి తాను సిద్ధంగా వున్నానని అంది. తెలుగు .. తమిళ భాషల్లో ఈ ఇద్దరి కాంబినేషన్లో ఏదైనా ప్రాజెక్టును ఎవరైనా సెట్ చేస్తారేమో చూడాలి. అన్నట్టు తమన్నా తాజా హిందీ చిత్రంగా రూపొందిన 'ఖామోషి' ఈ నెల 17న విడుదల కానుంది. కాజల్ తాజా చిత్రంగా నిర్మితమైన 'సీత' ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
tamannah
kajal

More Telugu News