హే త్రిషా... మనిద్దరం మ్యారేజ్ చేసుకుందామా?... మూడోసారి అడిగిన చార్మి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హే త్రిషా... మనిద్దరం మ్యారేజ్ చేసుకుందామా?... మూడోసారి అడిగిన చార్మి!

  • శనివారం నాడు త్రిష పుట్టినరోజు
  • మరోసారి పెళ్లి ప్రపోజల్ తెచ్చిన చార్మి
  • ఎప్పుడో ఓకే చెప్పానన్న త్రిష
తన సహనటి త్రిషపై తనకు ఏమాత్రం ప్రేమ తగ్గలేదని మరోసారి నిరూపించింది చార్మీ. త్రిష అంటే తనకెంతో ఇష్టమని, ఆమెను పెళ్లి చేసుకోవాలని ఉందని గతంలో చెప్పిన చార్మి, మరోసారి అదే ప్రపోజల్ ను తెరపైకి తెచ్చింది. నిన్న త్రిష 36వ పుట్టినరోజు వేడుకను జరుపుకోగా, చార్మీ ట్వీట్ చేస్తూ, "బేబీ ఐ లవ్‌ యూ టుడే... ఫరెవర్‌. నా మోకాలిపై కూర్చుని నీ సమ్మతి కోసం ఎదురుచూస్తున్నా. మనం పెళ్లి చేసుకుందామా?" అని ప్రశ్నించింది.

ఇదే సమయంలో తనను త్రిష ముద్దుపెట్టుకుంటున్న ఫోటోను చార్మి, తన అభిమానులతో షేర్ చేసుకుంది. గతంలో 2015లో ఓ మారు, 2017లో మరోమారు చార్మి ఇలాగే ట్వీట్ చేసింది. ఇక, చార్మి తాజా ట్వీట్ పై స్పందించిన త్రిష, "నేను నీకు ఎప్పుడో ఓకే చెప్పా" అని ట్వీట్‌ చేసింది. వీరిద్దరి మధ్య జరిగిన పెళ్లి సంభాషణ ఇప్పుడు వైరల్ అవుతోంది.
Trisha
Charmy
Marriage

More Telugu News