హీరోలను బోల్డ్ యాక్టర్ అని పిలిచే దమ్ముందా?: నటి ఆశా సైనీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హీరోలను బోల్డ్ యాక్టర్ అని పిలిచే దమ్ముందా?: నటి ఆశా సైనీ

  • నటి అన్న తరువాత అన్ని రకాల పాత్రలు చేయాలి
  •  మా ప్రతిభను నిరూపించుకోవడంలో అదొక భాగం
  •  బోల్డ్ సీన్స్ చేశామని చీప్ గా చూడటం కరెక్ట్ కాదు  
ఆశా సైనీ పేరు వినగానే 'నువ్వు నాకు నచ్చావ్'లో ఆమె చేసిన 'ఆశా' పాత్ర .. 'నరసింహనాయుడు'లో చేసిన 'లక్స్ పాప' డాన్స్ ప్రేక్షకులకు గుర్తొస్తాయి. తెలుగులో అంతగా అవకాశాలు రాకపోవడంతో ఆశా సైనీ .. తన పేరును ఫ్లోరా సైనీగా మార్చుకుని బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ప్రధానంగా హిందీ సినిమాలపైనే దృష్టిపెడుతూ .. తమిళ - కన్నడ సినిమాలను కూడా చేస్తూ వెళుతోంది.

ఒక వైపున సినిమాలు చేస్తూనే .. మరో వైపున 'పెద్దలకు మాత్రమే' అనబడే షార్ట్ ఫిల్మ్స్ లో బోల్డ్ సీన్స్ చేస్తూ వెళుతోంది. దాంతో అంతా ఆమెను బోల్డ్ హీరోయిన్ గా పిలవడం మొదలుపెట్టారు. ఈ విషయంపైనే ఆమె తాజాగా మీడియాకి చిన్నపాటి క్లాస్ పీకింది. "నటి అన్న తరువాత రకరకాల పాత్రలను చేస్తూ .. మా ప్రతిభను నిరూపించుకోవలసి ఉంటుంది. పాత్ర డిమాండ్ ను బట్టి కొన్ని బోల్డ్ సీన్స్ కూడా చేయవలసి ఉంటుంది. అంత మాత్రానికే చీప్ గా చూస్తారా? నన్ను బోల్డ్ హీరోయిన్ అన్నంత తేలికగా, నాతో కలిసి శృంగార సన్నివేశాల్లో నటించే హీరోలను బోల్డ్ యాక్టర్ అని పిలిచే దమ్ముందా?" అంటూ ప్రశ్నించింది. 
flora saini

More Telugu News