'సేమ్ టూ సేమ్'... మోదీని హిట్లర్ తో పోల్చుతూ వర్మ చూపిన ఫొటో సాక్ష్యం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'సేమ్ టూ సేమ్'... మోదీని హిట్లర్ తో పోల్చుతూ వర్మ చూపిన ఫొటో సాక్ష్యం!

  • జర్మన్ నియంత, నరేంద్ర మోదీ ఒకేలా
  • చిన్నారితో ఉన్న ఫోటోలు విడుదల చేసిన వర్మ
  • వైరల్ అవుతున్న వర్మ పోస్ట్
గత కొన్ని వారాలుగా ఏపీ ప్రభుత్వాన్ని, చంద్రబాబును టార్గెట్ చేసుకుని విమర్శనాస్త్రాలు సంధిస్తున్న వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌ గోపాల్ వ‌ర్మ ఒక్కసారిగా రూట్ మార్చారు. కౌంటింగ్ ముగిసి ఎన్నికల కోడ్ అయిపోయేంత వరకూ 'ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌'ను విడుద‌ల చేయ‌వ‌ద్ద‌ని ఈసీ ఆదేశించిన నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు.

జర్మన్ నియంత, రెండో ప్రపంచ యుద్ధ కారకుడు అడాల్ఫ్ హిట్లర్, మోదీ సేమ్ టూ సేమ్ అంటూ ఓ సాక్ష్యం కూడా చూపించారు. అప్పట్లో హిట్లర్ ఓ చిన్నపాప చెవులను పట్టుకుని ఉండగా, మోదీ ఇటీవల అదే విధమైన పోజ్ తో చిన్నారితో ఉన్న ఫోటోను పక్కపక్కన పెట్టారు. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది.



Narendra Modi
Hitler
Ramgopla Varma
Twitter

More Telugu News