ధర్నాకు వెళ్లనివ్వరని తెలిసి పోలీసులను తెలివిగా ఏమార్చిన తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్
- పోలీసుల కళ్లుగప్పి ట్యాక్సీలో పయనం
- ఆలస్యంగా గుర్తించిన పోలీసులు
- అప్పటికే ధర్నా మొదలుపెట్టేసిన లక్ష్మణ్
పోలీసుల రాకను ముందే ఊహించిన లక్ష్మణ్ ఎంతో తెలివిగా తన వాహనాన్ని అక్కడే ఉంచేసి, ఓ క్యాబ్ మాట్లాడుకుని దాంట్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లిపోయారు. పోలీసులు గుర్తించేసరికి ఆయన అక్కడి నుంచి నిష్క్రమించారు. ఆలస్యం చేయకుండా బీజేపీ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన దీక్షా వేదిక వద్దకు చేరుకుని నిరశన మొదలుపెట్టారు.