అకీరా ఏ ప్రొఫెషన్ ఎంచుకుంటాడో చూడాలి: రేణు దేశాయ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అకీరా ఏ ప్రొఫెషన్ ఎంచుకుంటాడో చూడాలి: రేణు దేశాయ్

  • అకీరా క్రికెట్ నేర్చుకున్నాడు
  •  కొంతకాలం బాస్కెట్ బాల్ పై దృష్టిపెట్టాడు
  •  ప్రస్తుతం మ్యూజిక్ నేర్చుకుంటున్నాడు    
పవన్ కల్యాణ్ .. రేణు దేశాయ్ తనయుడు అకీరా నందన్, హీరోగా ఎప్పుడు తెరపై కనిపిస్తాడా అని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే అకీరా నందన్ ఎంట్రీ ఇవ్వొచ్చనే ఆశాభావంతో వున్నారు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో రేణు దేశాయ్ మాట్లాడుతూ, అకీరా నందన్ గురించి ప్రస్తావించారు.

"అకీరా నందన్ ఫలానా ప్రొఫెషన్ లో ఎదగాలనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఎందుకంటే ప్రతి ఏడాది తన ప్రొఫెషన్ కి సంబంధించిన ఆశయం మారిపోతూ ఉంటుంది. ఒక ఏడాది క్రికెట్ అంటే ఇష్టమని చెప్పేసి క్రికెట్ నేర్చుకున్నాడు. ఆ తరువాత బాస్కెట్ బాల్ పట్ల ఆసక్తితో దానిపై దృష్టి పెట్టాడు. క్రితం ఏడాది .. రైటర్ కావాలనుందని చెప్పాడు .. ఇప్పుడేమో మ్యూజిక్ నేర్చుకుంటానని చెప్పి .. 'లండన్' కాలేజ్ కి పంపించమని అంటున్నాడు. ఆల్రెడీ పియానో నేర్చుకుంటున్నాడు. ఒక తల్లిగా చదువు సంస్కారాల విషయం నేను చూసుకుంటాను. ఇక తాను ఏం కావాలనేది అకీరానే నిర్ణయించుకోవాలి" అని చెప్పుకొచ్చారు. 
renu desai

More Telugu News