ఆసక్తిని రేపుతోన్న 'అభినేత్రి 2' ఫస్టులుక్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆసక్తిని రేపుతోన్న 'అభినేత్రి 2' ఫస్టులుక్

  • తెరపైకి 'అభినేత్రి' సీక్వెల్ 
  • డిఫరెంట్ లుక్స్ తో ప్రభుదేవా
  •  ప్రత్యేక పాత్రలో నందితా శ్వేత
ప్రభుదేవా, తమన్నా జంటగా ఎ.ఎల్. విజయ్ దర్శకత్వంలో 2016లో 'అభినేత్రి' చిత్రం తెరకెక్కింది. తమిళ, హిందీ భాషలతో పాటు తెలుగులోనూ ఈ సినిమా మంచి వసూళ్లను సాధించింది. దాంతో ఆ సినిమాకి సీక్వెల్ గా 'అభినేత్రి 2' సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను విడుదల చేశారు.

ప్రధాన పాత్రధారులైన ప్రభుదేవా .. తమన్నా ..  నందితా శ్వేతలపై ఆవిష్కరించిన ఫస్టులుక్ ఆసక్తిని రేకెత్తించేదిలా వుంది. 'అభినేత్రి'లో తమన్నా పల్లెటూరి అమ్మాయిగాను .. మోడ్రన్ అమ్మాయిగాను డిఫరెంట్ లుక్స్ తో కనిపించి మెప్పించింది. 'అభినేత్రి 2' మాత్రం ప్రభుదేవా డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నట్టు చెబుతున్నారు. ఇక నందితా శ్వేత పాత్ర ప్రధాన ఆకర్షణ అవుతుందనే చెప్పాలి. దర్శకుడు ఎ.ఎల్. విజయ్ ఈ సీక్వెల్ తోను హిట్ కొడతాడనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. 
prabhudeva
tamannah
nandita sweta

More Telugu News