సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • త్రిష చిత్రానికి మురుగదాస్ స్టోరీ 
  • నాని 'వ్యూహం' అప్ డేట్స్ 
  • 'చిత్రలహరి'కి టేబుల్ ప్రాఫిట్స్ 
*  చెన్నై బ్యూటీ త్రిష తాజాగా ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రానికి ఓకే చెప్పింది. శరవణన్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు మురుగదాస్ కథను అందిస్తున్నాడు.
*  నాని హీరోగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో 'వ్యూహం' పేరిట ఓ చిత్రం రూపొందనుంది. సుధీర్ బాబు కీలక పాత్ర పోషించే ఈ చిత్రాన్ని వచ్చే డిసెంబర్ లో రిలీజ్ చేసేలా చిత్ర నిర్మాణాన్ని ప్లాన్ చేస్తున్నారు.
*  సాయిధరం తేజ్ హీరోగా రూపొందిన 'చిత్రలహరి' చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరుపుకుంది. టాలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, చిత్రం థియేట్రికల్ హక్కులు 13 కోట్లకు, శాటిలైట్, డబ్బింగ్, డిజిటల్ హక్కులు 12 కోట్లకు అమ్ముడు పోయాయట. దీంతో చిత్ర నిర్మాతలు నాలుగు కోట్ల వరకు టేబుల్ ప్రాఫిట్స్ అందుకున్నట్టు చెబుతున్నారు. కాగా, ఈ చిత్రం రేపు విడుదలవుతోంది.
Trisha
murugadas
Nani
saidharam Tej

More Telugu News