తెలంగాణలో మాత్రం బలం పెరుగుతుంది: బీజేపీ నేత రామ్ మాధవ్!
- బలపడాలన్న ప్రయత్నం చేస్తున్నాం
- తెలంగాణలో సీట్లు పెరిగే చాన్స్ ఉంది
- టీడీపీతో కలిసుండటం వ్యతిరేకమైందన్న రామ్ మాధవ్
ఏపీలోనూ బలోపేతం అవుతున్నామని, గతంలో వచ్చిన రెండు సీట్లనూ నిలుపుకోగలమన్న నమ్మకంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. దక్షిణాదిలో కర్ణాటక మినహా మిగతా రాష్ట్రాల్లో తమ కూటమి పార్టీలతోనే అధికంగా కలిసున్నామని, అధికార పార్టీలతో భాగస్వామ్యాలను నెలకొల్పామని గుర్తు చేసిన ఆయన, ఏపీలో గడచిన ఐదేళ్లలో మూడున్నరేళ్లు టీడీపీతో కలిసున్నామని, అదే తమకు కాస్తంత వ్యతిరేకమైందని అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికలను ఓ మెట్టుగా తీసుకుని తాము పైకి ఎక్కేందుకు ప్రయత్నిస్తామని అన్నారు.