మమ్మల్ని గెలిపిస్తే ‘అగ్రిగోల్డ్’ బాధితులకు మూడు నెలల్లో న్యాయం చేస్తాం: పవన్ కల్యాణ్
Add ap7am to your home Screen

మమ్మల్ని గెలిపిస్తే ‘అగ్రిగోల్డ్’ బాధితులకు మూడు నెలల్లో న్యాయం చేస్తాం: పవన్ కల్యాణ్

  • అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలు కన్నీళ్లు చూశాను
  • అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వం వేలం వేయలేకపోతోంది!
  •  టీడీపీ-వైసీపీ నాయకులు కుమ్మక్కయ్యారు
సామాన్యుడిని పల్లకీ ఎక్కించాలంటే జనసేన పార్టీకి ప్రజలు ఓటెయ్యాలని పవన్ కల్యాణ్ సూచించారు. దోపిడీ జరగాలంటే జగన్ మోహన్ రెడ్డిని, అవినీతి, ఇసుక మాఫియా జరగాలంటే టీడీపీని గెలిపించాలని, అదే, సామాన్యుడి కష్టాలు గట్టెక్కాలంటే ‘జనసేన’కు పట్టం కట్టాలని కోరారు.

 ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల గురించి పవన్ ప్రస్తావించారు. అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలు కన్నీళ్లు చూశానని అన్నారు. అగ్రిగోల్డ్ యాజమాన్యానికి చాలా ఆస్తులు ఉన్నాయని, కానీ, ఆ ఆస్తులను ప్రభుత్వం వేలం వేయలేకపోతోందని, దీనికి కారణం, టీడీపీ-వైసీపీ నాయకులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ గెలిచి అధికారంలోకి రాగానే మూడు నెలల్లోగా అగ్రిగోల్డ్ బాధితులందరికీ వారి డబ్బులిచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు.  
jansena
Pawan Kalyan
agrigold
Telugudesam
YSRCP

More Telugu News