మాయావతి కారు డోరు తీసి, ఆమె పాదాలకు నమస్కరించిన పవన్
- విశాఖ వచ్చిన మాయావతి
- ఏపీ, తెలంగాణలో ప్రచారం
- రెండు రోజుల పాటు మాయావతి ప్రచారం
దీనిలో భాగంగా మూడో తేదీ ఉదయం పవన్‌తో కలిసి విశాఖలో మీడియా సమావేశంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో జరగబోయే బహిరంగ సభకు విచ్చేస్తారు. 4వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు మాయావతి తిరుపతి శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తరువాత సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో జరగబోయే బహిరంగ సభలో ఆమె ప్రసంగించనున్నారు.