కొన్ని రోజులు వెయిట్ చేస్తే బిగ్ న్యూస్... అల్లు అర్జున్ గురించి 'హారిక అండ్ హాసినీ క్రియేషన్స్'!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొన్ని రోజులు వెయిట్ చేస్తే బిగ్ న్యూస్... అల్లు అర్జున్ గురించి 'హారిక అండ్ హాసినీ క్రియేషన్స్'!

  • త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చిత్రం
  • ఇంకా ప్రీ ప్రొడక్షన్ దశలోనే పనులు
  • అందుకే అప్ డేట్ ఇవ్వలేకున్నాం
'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా' సినిమా వచ్చి చాలా కాలం అయింది. ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ మరో చిత్ర షూటింగ్ లో ఇంతవరకూ పాల్గొనలేదు. ఆయన హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తాము సినిమా చేయనున్నామని  'హారిక అండ్ హాసినీ క్రియేషన్స్' ప్రకటించింది. ఇక అల్లు అర్జున్ టాలీవుడ్ లోకి వచ్చి 16 సంవత్సరాలైన సందర్భంగా ఆయన ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది 'హారిక అండ్ హాసినీ క్రియేషన్స్'.

సినిమాకు సంబంధించి ఓ ప్రకటన చేస్తూ, "అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌  శ్రీనివాస్‌ ల కాంబినేషన్‌ పై ఫ్యాన్స్ తో పాటు మేం కూడా చాలా ఆత్రుతగా ఉన్నాం. ప్రస్తుతం ఇంకా ప్రీ ప్రొడక్షన్‌ దశలోనే పనులు ఉన్న కారణంగా ఎలాంటి అప్‌డేట్స్ ఇవ్వలేకపోతున్నాం. అన్నీ కుదిరిన తరువాత సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తాం" అని తమ అధికారిక ట్విట్టర్ పేజీలో పేర్కొన్నారు.



Trivikram
Allu Arjun
Harika & Hasini
New Movie

More Telugu News