టర్కీలో హీరో విశాల్ కు తీవ్ర గాయాలు... విరిగిన కాలు, చేయి!

  • టర్కీలో కొత్త సినిమా షూటింగ్
  • డూప్ లేకుండా ఫైట్ చేసిన విశాల్
  • అభిమానుల్లో కలవరం
ప్రముఖ తమిళ నటుడు విశాల్ కు షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం విశాల్, తమన్నాతో కలిసి ఓ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తుండగా, దీని షూటింగ్ టర్కీలో జరుగుతోంది. ఓ ఫైట్ సీన్ ను చిత్రీకరిస్తున్న వేళ, విశాల్ కాలు, చేయి విరిగినట్టు తెలుస్తోంది. కాలికి, చేతికి బ్యాండేజ్ తో ఉన్న విశాల్ ఫోటో బయటకు వచ్చి, అభిమానులను కలవరపెడుతోంది.

 ఫైట్ సీన్ లను డూప్ లేకుండా చేసే విశాల్, ఈ చిత్రంలోనూ అలాగే చేస్తూ గాయపడ్డారని చిత్ర యూనిట్ పేర్కొంది. కాగా, గతంలో సుందర్ సి దర్శకత్వంలో విశాల్ రెండు సినిమాలు చేశాడు. ఇప్పుడిది వారిద్దరి కాంబినేషన్ లో మూడో చిత్రం. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం షూటింగ్ ను 50 రోజుల పాటు టర్కీలో జరపాలని యూనిట్ ప్లాన్ చేసింది. తాజాగా, విశాల్ కు ప్రమాదంతో ఆయన షూటింగ్ లో పాల్గొనే అవకాశం లేకపోవడంతో సినిమా షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. గతంలో 'తుప్పరివాలన్' సినిమా షూటింగ్ లోనూ విశాల్ గాయపడిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Vishal
Turkey
Shooting
New Movie
Accident

More Telugu News